హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ చిన్నారికి చెవులు, ముక్కులు కుట్టించడానికి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ బ్రేక్‌ డౌన్‌ కావడంతో డ్రైవర్‌ దాన్ని రోడ్డు పక్కన ఆపాడు. అయితే కారును వేగంగా నడుపుతున్న వ్యక్తి ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో గమనించకుండా లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. ఇరుక్కుపోయిన వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఆ తర్వాతే మృతదేహాలను, క్షతగాత్రులను తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)