హైదరాబాద్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైన 16 కార్లు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ యూసఫ్‌గూడలోని సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే 'నాని కార్స్‌' గ్యారేజీలోమంగళవారం తెల్లవారుఝామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  గ్యారేజీలో మెుత్తం 20 కార్లు ఉండగా, వాటిల్లో 16 కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కార్‌ గ్యారేజీ పక్కనే పక్కనే నివాస భవనాలు ఉండటంతోమంటలు అటు వ్యాపించి వాటికి అంటుకోకుండా నివారణ చర్యలు తీసుకున్నారు. 20 కార్లలో 16 కార్లు కాలి బూడిదవ్వగా.. మరో నాలుగు కార్లకు నిప్పంటుకోకుండా అగ్ని మాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపకశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)