విమానంలో 12 సంవత్సరాల్లోపు పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలి !

Telugu Lo Computer
0


12 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పక్కనే సీటును కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరెక్టర్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది.  పిల్లలు తల్లిదండ్రులు, సంరక్షకులతో ప్రయాణించిన సందర్భాల్లో చాలాసార్లు దూరంగా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తోందంటూ డీజీసీఏకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న డీజీసీఏ.. తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరి వద్ద కూర్చునే అవకాశం ఉంటే ప్రయాణం సజావుగా సాగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నది. అలాగే, పిల్లలకు తల్లిదండ్రుల్లో ఎవరి పక్కన సీటును కేటాయిస్తే.. ఆ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది. దాంతో పాటు మరికొన్ని రూల్స్‌ను సైతం డీజీసీఏ మార్చింది. ప్రిఫరెన్షియల్ సీటింగ్ గురించి ప్రస్తావించింది. విమానం బయలుదేరే సమయం వరకు చెకిన్ కోసం ఏ సీటునూ ఎంచుకోని ప్రయాణికులకు ఆటోమెటిక్‌గా సీటును కేటాయించే నిబంధనను సవరించింది. జీరో బ్యాగేజీ ఛార్జీలు, భోజనం, స్నాక్, డ్రింక్ ఛార్జీలు, సంగీత వాయిద్యాల క్యారేజ్ కోసం ఛార్జీలను పెంచుకునేందుకు షెడ్యూల్ చేసిన విమానయాన సంస్థలకు అనుమతి ఇచ్చింది. ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్‌లో డీజీసీఏ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)