140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ఆశలు కాంగ్రెస్ మేనిఫెస్టో !

Telugu Lo Computer
0


హైదరాబాద్ శివారు తుక్కుగూడలోని భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు,  140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ఆశలని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 5 హామీలు.. దేశ ప్రజల ఆశలు, ఆశయాలేనని వివరించారు. దేశంలోని నిరుద్యోగులు అందరికీ లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం ఇప్పించబోతున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ కింద శిక్షణ ఇస్తామని.. దేశంలోని యువత అందరికీ ఏడాది పాటు అప్రంటీస్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. దేశంలోని నిరుద్యోగ యువత అందరికీ లక్ష రూపాయల జీతంతో ఏడాదిపాటు అప్రంటీస్ శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఈ శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. యువతకు సంబంధించి ప్రతి విషయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ప్రకటించారు. మహిళల కోసం నారీ న్యాయ్ నినాదంతో ముందుకొస్తున్నామని తెలిపారు. నారీ న్యాయ్ కింద ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు.. సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నట్లు వివరించారు. నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దేశంలోని ఏ కుటుంబానికి కూడా సంవత్సర ఆదాయం లక్ష రూపాయలు తక్కువ కాకుండా చూస్తామి ప్రకటించారు. ఇక తెలంగాణ సంబంధి పలు హామీలు ఇచ్చారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టుబడి ఉన్నామని తెలిపారు. పాలమూరుకు జాతీయ హోదా ,మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)