ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడిలో 14 మంది పాలస్తీనియన్లు మృతి

Telugu Lo Computer
0


క్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ దళాలు జరిపిన దాడిలో 14 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇజ్రాయిల్‌ దళాల దాడిలో గాయపడిన పాలస్తీనియన్లను తరలించేందుకు వెళ్లిన ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ కూడా మరణించినట్లు పేర్కొన్నారు. పాలస్తీనా నగరమైన తుల్కర్మ్‌కు సమీపంలో ఉన్న నూర్‌ షామ్స్‌ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ దళాలు దాడిని ప్రారంభించాయని, శనివారం వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నాయని అన్నారు. సుమారు 10 లక్షల మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న దక్షిణ నగరమైన రఫా, సెంట్రల్‌ గాజాలోని అల్‌ నుసైరత్‌, ఉత్తరాన అల్‌ జబాలియా ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ దళాలు దాడులు జరిపాయని హమాస్‌ మీడియా పేర్కొంది. సెంట్రల్‌ గాజాలోని అన్‌ నుసైరత్‌లో ఐదు నివాసాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. రఫాలో ఓ ఇంటిపై జరిపిన దాడిలో తండ్రి, కుమార్తె మరణించారని పాలస్తీనా మీడియా వెల్లడించింది. ఈ దాడిలో ఓ గర్భిణీ కూడా మరణించారని, కానీ శిశువును వైద్యులు రక్షించగలిగారని తెలిపింది. శిశువు ఆ కుటుంబంలో శిశువు మాత్రమే జీవించి ఉందని వైద్యులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)