టీటీడీకి రికార్డు స్థాయిలో ఆదాయం !

Telugu Lo Computer
0


2023-24 ఏడాదికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.  రూ.1,161కోట్లు, 1,031 ​కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్‌ చేసింది. గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం గణనీయంగా పెరిగింది. తాజాగా రూ.1,161కోట్లు, 1,031 ​కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్‌ చేయడంతో మొత్తంగా రూ.18వేల కోట్లకు డిపాజిట్లు చేరుకున్నాయి. దీంతో, ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ 1,200 కోట్ల దాటింది. కాగా, 2018 నాటికి ఏటా లభించే వడ్డీ రూ.750 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఐదేళ్ల కాలంలో వడ్డీ దాదాపుగా 500 కోట్లు ఎక్కువకు చేరుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో, శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. తిరుమలలో ఉచిత దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఇక, నిన్న(శనివారం)73,051 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజు 34,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92కోట్లుగా ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)