ఎర్ర మందారం - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


మందార ఆకులను, పువ్వులను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. కొన్ని దేశాలలో మందార ఆకులు పువ్వులతో వంటలు, పానీయాలు తయారు చేసుకుంటారు. ఈ మందార పువ్వు తీపి, ఆస్ట్రిజెంట్ రుచిని కలిగి ఉంటుంది. ప్రకృతిలో లభించే చల్లని పువ్వు కూడా మందారమే . మందారం పువ్వులలో ఎరుపు, పసుపు, తెలుపు, నారింజ, గులాబి, లేయర్డ్ మందారం ఇలా మందారంలో అనేక రంగులు మనకు అందుబాటులో ఉన్నాయి.  ఎర్ర మందారం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి ముఖ్యమైన సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వులు పిత్తాన్ని తగ్గిస్తాయి. రక్తస్రావ నివారిణి లక్షణాలను కలిగి ఉంటాయి. మందారతో గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్, మైగ్రేన్లు, మొటిమలు, అసిడిటీ, అల్సర్లు, పైల్స్, నిద్రలేమి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మందార పువ్వులు శారీరక ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. మందార పువ్వులను మనం రోజూ ఆహారంలో తీసుకుంటే అద్భుత ఫలితాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)