అసహజ శృంగారం కోసం వేధింపులు తాళలేక హత్య !

Telugu Lo Computer
0

తెలంగాణలోని జనగాం జిల్లా మూన్‌రాయి తండాకు చెందిన భీమానాయక్‌ మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్‌లో భార్యాపిల్లలతో ఉంటూ కూలీ పనులు చేసుకుంటాడు. వారం రోజుల క్రితం స్థానిక బస్టాండ్‌అవరణలో కొండాపూర్‌లోని ఓ డైయిరీలో పని చేస్తున్న బిహార్‌కు చెందిన మితేష్‌కుమార్‌ (25) భీమానాయక్‌కు పరిచయమయ్యాడు. కూలీపనులు ఉన్నప్పుడు చెబుతా రావాలని యువకుడి వద్ద నుంచి భీమానాయక్‌ ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్‌ చేస్తూ అసహజ శృంగారం చేయాలని కోరాడు. మితేష్‌కుమార్‌ నిరాకరించడంతో అసభ్యంగా తిడుతూ చంపుతానని బెదిరింపులకు దిగాడు. రాత్రింబవళ్లు ఫోన్‌ చేస్తూ వేధింపులకు దిగడంతో ఏలాగైన భీమానాయక్‌ను చంపాలని మితేష్‌కుమార్‌ పథకం వేశాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం భీమానాయక్‌కు మితేష్‌కుమార్‌ ఫోన్‌చేసి తాను నివాసం ఉంటున్న కొండాపూర్‌లోని డెయిరీకి రావాలని, మద్యంతాగి హోమో సెక్స్‌ చేసుకుందామని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన భీమానాయక్‌ అక్కడి వెళ్లగా మద్యం తాగించి తన వద్ద ఉన్న కత్తితో భీమానాయక్‌ కడుపులో పొడిచాడు. దీంతో తీవ్రరక్త గాయాలతో కేకలు వేస్తూ రోడ్డుపైకి వచ్చాడు. గమనించిన వాహనాదారుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితున్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితునిడి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)