ఉదయనిధి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం !

Telugu Lo Computer
0


మిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌  సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపాయి. దీనికి గానూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం  ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ''వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న మీ హక్కులను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మీరే రక్షణ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో తెలియదా? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు'' అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది. గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ''సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి'' అంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)