సోఫియా లియోన్ ఆత్మహత్య !

Telugu Lo Computer
0


మెరికాలోని తన అపార్ట్‌మెంట్‌లో అడల్ట్ నటి సోఫియా లియోన్ మృతి చెంది కనిపించారు. ఈ నెల మొదట్లోనే ఈ ఘటన జరగ్గా తాజాగా ఆమె సవతి తండ్రి మైక్ రొమెరో ఈ విషయం తెలిపారు. ఈ నెల 1న అమెరికాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఎలాంటి కదలికలు లేని స్థితిలో కనిపించినట్టు ఆయన తెలిపారు. క్రౌడ్ ఫండింగ్ సైట్ 'గోఫండ్‌మీ'లో ఆయనీ విషయాన్ని తెలుపుతూ సోఫియా స్మారకం కోసం నిధులు ఇవ్వాలని కోరారు. ఆమె తల్లి, కుటుంబ సభ్యుల తరపున భారమైన హృదయంతో ఈ విషయాన్ని తెలిపారు. సోఫియా ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్టు తెలిపారు. ఆమె మరణంతో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నటి మరణానికి గల కారణాలపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వివరించారు. 18 ఏళ్ల వయసులోనే సోఫియా అడల్ట్ ఇండస్ట్రీలో ప్రవేశించింది. ఆమె నికర ఆస్తివిలువ మిలియన్ డాలర్లు. కాగా, అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది నాలుగో అకాల మరణం. ఇంతకుముందు కాగ్నీ లిన్ కార్టర్, జెస్సీ జేన్, థైనా ఫీల్డ్స్ మృతి చెందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)