వెజిటేరియన్స్ కోసం ప్రత్యేకంగా 'ప్యూర్ వెజ్ మోడ్' !

Telugu Lo Computer
0


జొమాటో వెజిటేరియన్స్ కోసం ప్రత్యేకంగా 'ప్యూర్ వెజ్ మోడ్'ని ప్రారంభించింది. దీని కోసం ప్రత్యేకంగా డెలివరీ ఏజెంట్లను కూడా నియమించారు. ఒకవేళ కస్టమర్స్ ప్యూర్ వెజ్ మోడ్ ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ జాబితాలో శాఖాహార ఆహారాన్ని అందించే రెస్టారెంట్ల పేర్లు మాత్రమే కనిపిస్తాయి. నాన్-వెజ్ అందించే రెస్టారెంట్లు కనబడవు. ఈ ఫుడ్ను డెలివరీ చేసే వారు కేవలం శాఖాహారులకు సంబంధించిన ఆహారాన్ని మాత్రమే పెట్టుకుంటారని, ఇతర ఫుడ్ ని బ్యాగుల్లో పెట్టుకోరని జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఇండియాలో అత్యధిక శాకాహారులు ఉన్నారు. వారు ఆహారాన్ని ఎలా వండుతారు, ఎలా తీసుకొస్తారనే విషయంలో ఆందోళన చెందుతున్నట్లుగా ఫీడ్బ్యాక్ వచ్చిందని , ఈ మేరకు కొత్త సేవను తెచ్చినట్లు పేర్కొన్నారు.దీని వెనుక ఎలాంటి మతపరమైన లేదా రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో కేక్లు పాడవకుండా డెలివరీ చేయడానికి ప్రత్యేక ఫ్లీట్లను కూడా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)