బీజేపీ నేతలకు పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరిక !

Telugu Lo Computer
0


ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు. కాంగ్రెస్ రూ. 1800 కోట్లు ఫైన్ కట్టాలని ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు అందుకున్న తర్వాత దీనిని ''టాక్స్ టెర్రరిజం''గా ఆరోపించింది. '' ప్రభుత్వం మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇలాంటివి మళ్లీ చేసే ధైర్యం ఎవరూ చేయని విధంగా చర్యలు తీసుకుంటాము. ఇది నా హామీ'' అని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఐటీ శాఖ రూ. 200 కోట్ల జరిమానా విధించడంతో ఇప్పటికే నిధుల కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి తాజా నోటీసులు మరింత ఇబ్బందికి గురిచేశాయి. హైకోర్టు ఈ కేసులో ఎలాంటి ఉపశమనం ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఐటీ శాఖ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. బీజేపీ గత కొన్నేళ్లుగా వేలాది మంది నుంచి విరాళాలు పొందిందని, వారి ఆదాయపు పన్ను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. బీజేపీ ఆదాయ పన్ను చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఆ పార్టీ నుంచి రూ. 4617.58 కోట్ల డిమాండ్‌ని సేకరించాలని ఐటీని కోరారు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, పోస్ట్ రైడ్ లంచాలు, షెల్ కంపెనీలను ఉపయోగించి ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ ద్వారా బీజేపీ రూ. 8200 కోట్లు వసూలు చేసిందని జైరాం రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్‌ని ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)