ఐటీ నోటీసులపై దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు !

Telugu Lo Computer
0


ఐటీ శాఖ నోటీసులను నిరసిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిరసనలకు పిలుపునిచ్చింది. శనివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర విభాగాలను కోరారు. పీసీసీ ప్రధాన కార్యాలయాల దగ్గర, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యాలయాల దగ్గర ధర్నా చేయాలని అధిష్టానం ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో శుక్రవారం 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1800 కోట్లకుపైగా డిమాండ్‌ నోటీసులను ఐటీ పంపించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)