భాజపాలో చేరిన అనురాధ పౌడ్వాల్ !

Telugu Lo Computer
0


ప్రముఖ బాలీవుడ్‌ గాయని అనురాధ పౌడ్వాల్ శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మంతో గాఢమైన అనుబంధం ఉన్న ప్రభుత్వంలో చేరడం సంతోషంగా ఉందని, భాజపాలో చేరడం తన అదృష్టమని పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అధిష్టానం నాకు ఎలాంటి సలహా ఇస్తారో తెలియదు. వారు చెప్పినట్లుగా నడుచుకుంటానని తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా రాజ్యసభ సభ్యుడు అజయ్‌ ప్రతాప్ సింగ్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం అనురాధ భాజపాలో చేరారు. 1954లో కర్ణాటకలోని కార్వార్‌లో జన్మించిన అనురాధ 1973లో 19 సంవత్సరాల వయసులో అమితాబ్‌ బచ్చన్‌, జయప్రద నటించిన అభిమాన్‌ చిత్రంతో సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. 'ఆషికీ', 'దిల్‌ హై కీ మంత నహీ', బేటా చిత్రాలకు ఆమె ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఒరియా, అస్సామీ, పంజాబీ, భోజ్‌పురి, నేపాలీ భాషలతో సహా 9,000 పాటలు, 1,500లకు పైగా భజనలను ఆమె స్వరపరిచారు.


Post a Comment

0Comments

Post a Comment (0)