ఆంధ్రప్రదేశ్ లో 46వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో 46వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు, దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందించనున్నట్లు సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ''ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నాం. ఈసారి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసేందుకు అవకాశం ఉంది. క్రిమినల్‌ కేసులు ఉన్న అభ్యర్థులు పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలి. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత పెంచుతాం. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు ఇప్పటికే పరీక్షించాం. ఇప్పటి వరకు రూ.164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం'' అని సీఈవో వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)