పేటీఎం యాప్ యూజర్లకు సూచనలు !

Telugu Lo Computer
0


మొబైల్, డీటీహెచ్ రీచార్జీతోపాటు అన్ని రకాల పేమెంట్స్ సేవలను పేటీఎం యాప్ యూజర్లు యధావిధిగా కొనసాగించొచ్చునని తెలిపింది. ఈ నెల 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా లేదా వాలెట్లలో కొత్త డిపాజిట్లు తీసుకోవద్దని ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)లో ఉన్న డబ్బు నిల్వలు అయిపోయే వరకూ ఆ ఖాతాలు వాడుకోవచ్చు.తమ యాప్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫాస్టాగ్ కొనుగోలు చేయొచ్చునని పేటీఎం తెలిపింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల ఫాస్టాగ్‌లతో రీచార్జీ చేసుకోవచ్చునని పేర్కొంది. ఇప్పటి వరకూ పీపీబీఎల్ ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్ పూర్తయ్యే వరకూ వాడుకోవచ్చు.సినిమాలు, మెట్రో రైలు, విమానం, రైలు, బస్సు ప్రయాణ టికెట్లు మొదలు సినిమా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. మొబైల్ ఫోన్ల రీచార్జీ, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు, విద్యుత్, వాటర్, గ్యాస్, ఇంటర్నెట్ తదితర యుటిలిటీ బిల్లులూ పే చేయొచ్చు.యూపీఐ లావాదేవీలకు ఒక థర్డ్ పార్టీ యాప్‌గా పేటీఎం పనిచేస్తుంది. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా యూపీఐ లావాదేవీల నిర్వహణకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతి ఇచ్చింది. పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్, కార్డు మెషిన్లు యథాతథంగా పని చేస్తాయని పేటీఎం తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)