పీతలు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


పీతలతో రకరకాల వంటలు తయారు చేసుకుని ఆస్వాదిస్తుంటారు. మరి కొందరు పీతలను చూస్తేనే వణికిపోతుంటారు. అయితే పీతలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతులేని లాభాలను చేకూరుస్తాయి. పీతలు ప్రోటీన్ కు పవర్ హౌస్ లాంటివి. అలాగే పీతల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్, విటమిన్స్‌ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. అందువల్ల వారానికి ఒకసారి పీతలను తింటే చాలా లాభాలు పొందుతారు. ముఖ్యంగా పీతల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో మరియు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.పీతల్లో లభించే విటమిన్ బి12 మరియు జింక్ వంటి పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పీతల్లో ఉండే సెలీనియం ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇది పలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. పీతల్లో ఉండే ప్రోటీన్ కండరాల పెరుగుదల, మరమ్మత్తు మరియు నిర్వహణకు తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి  కూడా పీతలు మంచి ఆహారంగా చెప్పబడింది. అంతే కాదు పీతల్లో ఉండే ఐరన్  కంటెంట్ రక్తహీనతను నివారిస్తుంది. నీరసం, అలసట వంటి సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి బోలెడంత శక్తిని చేకూరుస్తుంది. మెదడు పనితీరు మరియు కంటి ఆరోగ్యానికి కూడా పీతల్లో ఉండే పోషకాలు దోహదం చేస్తాయి. పైగా పీతల్లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)