ఇడ్లీ, దోస ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు !

Telugu Lo Computer
0


ఇడ్లీ, దోస జీర్ణశక్తిని పెంచి శరీరంలో రోగనిరోధకశక్తిని మెరుగుపరచడానికి తోడ్పడతాయి. బియ్యం, మినప పప్పు నానబెట్టిన తర్వాత మిక్సీలో కానీ, గ్రైండర్ లోకానీ వేసి పిండిని తయారు చేస్తారు. వీటితో ఎన్నిరకాల పదార్థాలైనా చేసుకోవచ్చు. దీనిలో ప్రొబయెటిక్స్, బతికున్న బ్యాక్టీరియా ఉండి పేగు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. పులియబెట్టిన పదార్థాలను ఉదయం లేదంటే మధ్యాహ్నం మాత్రమే తినాలి. రాత్రి వేళ తింటే డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. పులిసిన ఆహారం తినడం వల్ల కడుపులో వేడి పెరుగుతుంది. దీనివల్ల రాత్రిపూట నిద్రకు భంగం కలుగుతుంది. మరికొందరికి కడుపులో అనీజీగా ఉండటంతో పాటు బ్లోటింగ్ సమస్యలు వస్తాయి. నిద్రించే సమయానికి ముందు ఈ తరహా ఆహార పదార్థాలను తినకూడదు. పులిసిన ఆహారాలు అందరికీ పడకపోవచ్చు. కొంతమందికి రియాక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.  పులిసిన వాటిల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ లాంటి ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. పులిసిన పదార్థాలు తిన్నవెంటనే కడుపునొప్పి వస్తే వాటిగురించి ఆలోచించాలి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిది.

Post a Comment

0Comments

Post a Comment (0)