తొలి అవార్డును అందుకున్నా : ప్రశాంత్ వర్మ !

Telugu Lo Computer
0


నుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాను తొలి అవార్డును అందుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకి పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఇటీవల ఓటీటీలో అడుగుపెట్టిన హనుమాన్ అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక హనుమాన్ కు బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు రావడంతో డైరెక్టర్ ఆనందం రెట్టింపు అయ్యింది.. ఈ విషయాన్ని డైరెక్టర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.. హనుమాన్‌ సినిమాకి తొలి అవార్డు అందుకున్నాను. థాంక్యూ రేడియో సిటీ అంటూ ప్రశాంత్ వర్మ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రశాంత్ వర్మకి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. మున్ముందు ఇంకా అవార్డులను అందుకుంటారని కామెంట్స్ పెడుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)