రోబోలతో ఫుడ్‌ డెలివరీ !

Telugu Lo Computer
0


న్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ ఉబర్‌ ఈట్స్‌ జపాన్‌లో ఫుడ్‌ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్‌కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్‌ డెలివరీ చేసే సర్వీసులను బుధవారం ప్రారంభించింది. దేశం ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను ఇది తీరుస్తుందని పేర్కొన్నది. ప్రస్తుతం ఈ రోబోల సేవలను టోక్యోలోని రెండు స్టోర్లకు మాత్రమే పరిమితం చేశామని, భవిష్యత్తులో వీటిని మరిన్ని స్టోర్లకు విస్తరిస్తామని నిర్వాహకులు తెలిపారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. 27 లీటర్ల పానీయాలు, 27 కేజీల ఆహారాన్ని ఏకకాలంలో తీసుకుపోగల సామర్థ్యం వీటి సొంతం.

Post a Comment

0Comments

Post a Comment (0)