జమ్ముకశ్మీర్‌లో 53 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని !

Telugu Lo Computer
0


ర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారి జమ్ముకశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి రూ.6,400 కోట్ల విలువైన 53 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. శ్రీనగర్ లోని  బక్షి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వీటిని ప్రారంభించారు. వికసిత్ భారత్ వికసిత్ జమ్ముకశ్మీర్ అజెండాతో ఈ సభను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సభలో జమ్ముకశ్మీర్ లెఫ్ట్ నెంట్  గవర్నర్ మనోజ్ సిన్హా కూడా పాల్గొన్నారు. అంతకు ముందు ప్రధాని మోడీ లోకల్ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ని సందర్శించారు. కశ్మీర్ లో  పర్యాటక రంగంపై దృష్టి సారించిన మోడీ ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ లో భాగంగా రూ.1,400 కోట్ల విలువైన ప్రాజెక్ట్ లను ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికి ప్రభుత్వ ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందించారు. అలాగే పలు పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. రైతులు, వ్యాపారులతోనూ ముచ్చటించారు. ఉద్యోగావకాశాలపై స్థానిక యువతతో ముఖాముఖి మాట్లాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)