కండరాలు, ఎముకలను బలంగా ఉంచడానికి ప్రోటీన్స్ !

Telugu Lo Computer
0


కండరాలు, ఎముకలను బలంగా ఉంచడానికి శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం. అందుకోసమని మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రోటీన్ వినియోగం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే.. వైద్యనిపుణులు బరువు తగ్గించే ప్రొటీన్‌ను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతుంటారు. అందుకోసమని వైద్యులు ఎక్కువగా.. కోడిగుడ్లు లేదా మాంసం తినండని సూచిస్తారు. బాదంపప్పును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. బాదంలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పును స్నాక్‌గా కూడా తినవచ్చు. అంతేకాకుండా.. బాదంపప్పును స్మూతీస్, షేక్స్, సలాడ్లు, పండ్లతో తింటే చాలా మంచిది. వేరుశెనగ నుండి తయారైన వేరుశెనగ వెన్నలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. దీనిని ఎక్కువగా బ్రెడ్ మీద రాసుకుని తింటారు. దీనిని ఓట్ మీల్, స్మూతీస్ మరియు షేక్స్ మొదలైన వాటితో కూడా కలిపి తింటారు. అయితే.. వేరుశెనగ వెన్నను ఎక్కువ శాతం తీసుకోకపోవడం మంచిది.. ఎందుకంటే.. శరీరం వేడి బారిన పడకుండా ఉంటుంది. తినే ఆహారంలో విత్తనాలను చేర్చుకుంటే చాలా మంచిది. వీటిల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు అనేక రకాల విటమిన్లు విత్తనాలలో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడి గింజల్లో మంచి ప్రొటీన్లు ఉంటాయి. ఇవి.. బరువు తగ్గించడంలో మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఎరుపు, పసుపు, నారింజ, నలుపు, ఆకుపచ్చ మరియు గోధుమ పప్పులలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పప్పులను అన్నంలో ఎక్కువగా తింటారు. పప్పులు తినడం వల్ల శరీరానికి మంచి ప్రొటీన్లు అందుతాయి. కేవలం అరకప్పు పప్పుల నుండి శరీరానికి 8 గ్రాముల వరకు ప్రొటీన్ లభిస్తుంది. ప్రోటీన్లు పొందడానికి చిక్పీస్ కూడా తినవచ్చు. చిక్పీస్ లో ఇనుము, ఫాస్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ K కలిగి ఉంటుంది. ఇది తినడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయి. అందుకోసమని రోజూ తినే ఆహారంలో చిక్‌పీస్‌ను చేర్చుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)