సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా !

Telugu Lo Computer
0


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష  లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్‌ ప్రకారం మే 26న జరగాల్సిన రాతపరీక్షను.. జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. ఈ మేరకు యూపీఎస్సీ  తన వెబ్‌సైట్‌లో ఓ ప్రకటనలో తెలిపింది. 'త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష - 2024ను వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించింది. మే 26న కాకుండా జూన్‌ 16న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్‌కు కూడా వర్తిస్తుంది' అని పేర్కొంది.


Post a Comment

0Comments

Post a Comment (0)