సుప్రీంకోర్టు చీవాట్లతో పొన్ముడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేందుకు అంగీకరించిన గవర్నర్‌ !

Telugu Lo Computer
0


మిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో  దిగొచ్చి, తమిళనాడు మాజీ మంత్రి పొన్ముడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేందుకు అంగీకరించారు. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి గతంలో జైలుశిక్ష పడింది. దాంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయింది. హైకోర్టు విధించిన శిక్షను సవాల్‌ చేస్తూ పొన్ముడి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. సర్వోన్నత న్యాయస్థానం పొన్ముడికి హైకోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో పొన్ముడి ఎమ్మెల్యేగా కొనసాగుతారని తమిళనాడు స్పీకర్‌ ప్రకటించారు. ఆ వెంటనే సీఎం స్టాలిన్‌ పొన్ముడి పేరును మంత్రిగా సిఫారసు చేశారు. అయితే అందుకు గవర్నర్‌ నిరాకరించారు. దాంతో స్టాలిన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టాలిన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి చీవాట్లు పెట్టింది. తాము ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం సాయంత్రం లోపు పొన్ముడిని మంత్రిగా నియమించడంపై నిర్ణయం తీసుకోవాలని డెడ్‌లైన్‌ పెట్టింది. దాంతో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి దిగొచ్చారు. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు సమ్మతి తెలిపారు. కోర్టు తీర్పును ధిక్కరించాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. గత పరిణామాల ఆధారంగానే తాను పొన్ముడితో మంత్రిగా ప్రమాణం చేయించలేదని వివరణ ఇచ్చారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పొన్ముడితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)