హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరంలో మరోసారి  చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ సృష్టించింది. శనివారం అర్ధరాత్రి మియాపూర్ పరిధిలోని వరల్డ్ వన్ స్కూల్‌లోకి కొంతమంది చెడ్డీలు ధరించి పదునైన ఆయుధాలతో ఒంటి మీద బట్టలు లేకుండా చొరబడ్డారు. అనంతరం స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో గల కౌంటర్‌లో ఉన్న సుమారు రూ.7.85 లక్షల నగదను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, దొంగతనానికి సంబంధించి మొత్తం ఫుటేజ్ ఆ గదిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో స్కూల్ యాజమాన్యం జరిగిన ఘటనపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)