ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు వలంటీర్లపై ఈసీ వేటు!

Telugu Lo Computer
0


న్నికల నిబంధనలు తుంగలో తొకకేవారిపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. సి-విజిల్‌కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తూ వెంట వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ తరుఫున ప్రచారం చేస్తున్న ఆరుగురు వలంటీర్లపై కొరఢా ఝులిపించింది. టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి సంతబొమ్మాళిలో వలంటీర్లు బొమ్మాళి ఉమాశంకర్, వాదాల దుర్గారావు, కల్లూరి పాపారావు, అట్టాడ కామేశ్వరరావు, మల్ల అశ్విని, బోడ శ్రీలత ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఆరుగురు వలంటీర్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధారాలతో సహా సి-విజిల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన ఎంపీడీఓ ఉమాసుందరి ఆ ఆరుగురు వలంటీర్లను విధుల నుంచి తొలగించామని చెప్పారు. మరోవైపు వైసీపీకి ప్రచారం చేసిన కాకినాడ జిల్లా కృష్ణపురం నోడల్ అధికారి గోపీనాథ్‌ను ఆర్వో శ్రీనివాస్ విధుల నుంచి తొలగించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)