ఉలవలు ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


లవలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు శక్తిని అందిస్తాయి. ఉలవల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక దగ్గు, ఉబ్బసం, మూత్రపిండాల్లో రాళ్లు, క్రమరహిత పీరియడ్స్‌లో కూడా ఉలవలు ఉపయోగకరంగా ఉంటుంది. ఉలవలు తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పప్పులో ఉండే పోషకాలు ఆకలిని అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇందులో కేలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఉలవలు పప్పు తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఉలవల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికల్ని మెరుగుపరుస్తుంది. తద్వారా మలం సాఫీగా వచ్చేలా చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. పెరిగే పిల్లలకు ఉలవలు తినిపిస్తే చాలా మంచిది. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో సహాయపడతాయి. వారిని బలంగా ఉంచుతాయి. ఉలవలు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. ఇది హానికరమైన పదార్థాలు, మూత్రపిండాల్లో రాళ్లను మూత్రం ద్వారా తొలగించడంలో సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్లను నివారించడంలో ఉలవలు ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. వీటిలోని పోషకాలు కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. కొందరు తరచూ ఎక్కిళ్లు సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఉలవలు తీసుకోవడం చాలా మంచిది. ఉలవలు తినడం ద్వారా ఎక్కిళ్లు రాకుండా ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు ఉలవలు తింటే చాలా మంచిది. వీటిలోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుతుంది. ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.  రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపర్చి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవల కషాయం తాగడం మంచిది. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది. తక్కువ స్పెర్మ్ కౌంట్ కారణంగా సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్న పురుషులకు కూడా ఉలవలు తినటం ఉపయోగపడుతుంది. అలాంటి వారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాత వీటిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)