పుట్టపర్తి లో కీచక అధ్యాపకుడి దురాగతాలు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలంలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాల అధ్యాపకుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నీ చదువు అంతా నేనే చూసుకుంటా, ఉద్యోగం వచ్చే వరకు ఖర్చులు భరిస్తా అంటూ కీచక అధ్యాపకుడు చెప్పిన మాయమాటల్ని విద్యార్థినులు నమ్మారు. అన్నింటికీ నేను ఉన్నా, చెప్పినట్లు ఒప్పుకో అంటూ సెల్‌ఫోన్‌ సందేశాలు పంపాడు. ముందు కొన్నిరోజులు బాగానే మాట్లాడినా తర్వాత అసభ్యకర సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. స్నానం చేసే వీడియోలు పంపు చూస్తా అంటూ ఒత్తిడి చేయడంతో అధ్యాపకుడిని నమ్మిన ఓ విద్యార్థిని అలాగే చేసింది. తర్వాత వాటి పేరుతో బెదిరిస్తున్నాడు. ఇలా ముగ్గురు విద్యార్థినులను వంచించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అధ్యాపకులు కూడా ఇలాగే చేస్తున్నట్లు సమాచారం. బాధిత విద్యార్థినులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయలేక, ఇంట్లో చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. విషయం బయటకు చెబితే వీడియోలు, ఫొటోలు బయటపెడతానంటూ బెదిరిస్తుండటంతో ఆ బాధితులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి ఈ అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు కలిగిన పాఠశాలను జూనియర్‌ కళాశాలగా మార్చారు. అప్పటి నుంచి కళాశాల అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. యాజమాన్యం నిర్వహణను గాలికి వదిలేసింది. కళాశాలలోని కొందరు విద్యార్థులు గంజాయి మత్తుకు అలవాటు పడినట్లు గుర్తించిన పోలీసులు కౌన్సెలింగ్‌ చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.


Post a Comment

0Comments

Post a Comment (0)