రూ.66 వేలు దాటిన బంగారం !

Telugu Lo Computer
0


అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.250 పెరిగి రూ.66,200 పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. బుధవారం ట్రేడింగ్‌లో తులం ధర బంగారం రూ.65,950 వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1700 పుంజుకుని రూ.77 వేల వద్దకు దూసుకెళ్లింది. బుధవారం రూ.75,300 వద్ద ముగిసింది. 'ఢిల్లీలో స్పాట్ గోల్డ్ (24 క్యారట్స్) తులం ధర రూ.250 పెరిగి రూ.66,200 పలికింది' అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఫ్యూచర్స్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్0 ధర రూ.165 తగ్గి రూ.65,730 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.39 శాతం తగ్గి ఔన్స్ బంగారం ధర 2172.20 డాలర్ల వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో కామెక్స్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 9 డాలర్లు పెరిగి 2,169 డాలర్లు పలికింది. ఔన్స్ సిల్వర్ ధర 24.92 డాలర్ల వద్ద నిలిచింది. 'ఇన్వెస్టర్లు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ), వీక్లీ జాబ్ డేటా, రిటైల్ సేల్స్ డేటా పట్ల సానుకూల ద్రుక్పథంతో ఉన్నారు` అని బీఎన్పీ పారిబాస్ కమొడిటీస్ ఫండమెంటల్ కరెన్సీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సింగ్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)