మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో రూ.580 కోట్లు స్తంభింపజేసిన ఈడీ !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఢిల్లీ, ముంబయి. కోల్‌కతాలలో దాడులు నిర్వహించిన ఈడీ యాప్‌ ప్రమోటర్‌కి చెందిన రూ.580 కోట్లు స్తంభింపజేసింది. ఏడాదికి పైగా ఈ విచారణ కొనసాగుతుండగా బెట్టింగ్ యాప్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.1200 కోట్లకుపైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 28న కోల్‌కతా, గురుగ్రామ్, ఢిల్లీ, ఇండోర్, ముంబయి, రాయ్‌పుర్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో రూ.1.86 కోట్ల విలువైన నగదు, రూ.1.78 కోట్ల విలువైన వస్తువులను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన టిబ్రేవాల్ అనే వ్యక్తి దుబాయ్‌లో ఉంటున్నట్లు ఈడీ తెలిపింది. అతను మహాదేవ్ యాప్ ప్రమోటర్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు ఈడీ  పేర్కొంది. ఆయనకు చెందిన రూ.580 కోట్ల విలువైన సెక్యూరిటీ హోల్డింగ్‌లను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద స్తంభింపజేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)