18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ?

Telugu Lo Computer
0


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం కొత్తగా ఎన్నికల తాయిలాలను ప్రకటించింది. ప్రత్యేకించి మహిళా ఓటు బ్యాంక్‌పై దృష్టి సారించిన ఆ పార్టీ- వరాల జల్లును కురిపించింది. మహిళలను ఆర్థికంగా చేయూత అందించడానికి ఉద్దేశించిన పథకాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పేర ఢిల్లీలో నివసించే ప్రతి మహిళకు, ప్రతి నెలా 1,000 రూపాయల నగదు మొత్తాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి ఆతిషి వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట్‌లో ఈ పథకాన్ని పొందుపరిచినట్లు తెలిపారు. ఈ మధ్యాహ్నం ఆమె అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం వరుసగా పదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోందని, దీనికి గుర్తుగా తమ రాష్ట్రం పరిధిలోని నివసించే ప్రతి మహిళకూ, ప్రతి నెలా 1,000 రూపాయలను మొత్తాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకాన్నిఅమలు చేయడానికి 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల మొత్తం అవసరమౌతుందని అంచనా వేశామని ఆతిషి చెప్పారు. ఈ మేరకు ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చును బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ప్రతి మహిళనూ ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను రూపొందించామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)