అరకు లోయలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య !

Telugu Lo Computer
0


రకులోయలో యువతి, యువకుడు ఆత్మహత్య కలకలం రేపుతోంది. కరక వలస వద్ద చెట్టుకు ఇద్దరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. సుంకరమెట్ట – కటికి జలపాతం మధ్య ఉన్న అడవిలో ఇద్దరు ఉరివేసుకున్నారు. వీరిని పశువుల కాపరి గుర్తించి పోలీసులకు సమాచారం అందించ్చారు. విషయం ఆ నోట ఈనోట పాకింది. వెళ్లి చూసేసరికి ఇద్దరు వేలాడుతూ కనిపించారు. ఒకే చున్నితో ఇద్దరూ మెడలో బిగించుకున్నారు. ఒక కొమ్మకు రెండు వైపులా ఇద్దరు వేలాడుతూ కనిపించారు. అబ్బాయి బ్లాక్ జీన్స్, బ్రౌన్ బ్లాక్ షర్ట్ ధరించగా.. అమ్మాయి బ్లూ వైట్ టాప్, బ్లాక్ లెగ్గిన్ ధరించి ఉన్నారు. ఈ దృశ్యాలు చూసిన వారందరి హృదయాలు కలచివేతకు గురైంది. ఇద్దరూ ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో కూడా తెలియదు. ప్రేమికులు పర్యాటకులుగా వచ్చి ఉరి వేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అరకులోయ పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. చనిపోయిన వారిద్దరినీ పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసు అధికారులువెల్లడిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)