మేడారం బయలుదేరిన సారలమ్మ !

Telugu Lo Computer
0


న్నెపల్లి నుంచి మేడారానికి సమ్మక్క కుమార్తె సారలమ్మ బయలుదేరింది. అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకువస్తున్నారు. జంపన్నవాగు మీదుగా మేడారం చేరుకోనున్నారు. సారలమ్మకు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సాదర స్వాగతం పలికారు. సారలమ్మ రాక నేపథ్యంలో భద్రతా బలగాలు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశాయి. అంతకుముందు కన్నెపల్లి గ్రామస్థులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరించారు. వనదేవతల రాక సందర్భంగా భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)