అమెరికాలో ప్రపంచంలో పొడవైన వ్యక్తి, పొట్టి మహిళ సందడి !

Telugu Lo Computer
0


తుర్కియేకు చెందిన సుల్తాన్‌ కోసెన్‌ ప్రపంచంలోనే పొడవైన వ్యక్తిగా కొనసాగుతుండగా, భారత్‌కు చెందిన జ్యోతి ఆమ్గే పొట్టి వ్యక్తిగా ఉన్నారు. వీరిద్దరి ఎత్తులో తేడా ఆరు అడుగులు కావడం గమనార్హం. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 2009లో ప్రపంచంలోనే పొడవైన వ్యక్తిగా సుల్తాన్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. ఆయన ఎత్తు 251 సెం.మీ(8 అడుగుల 2.8 అంగుళాలు). అతి పొడవైన అరచేయి కలిగిన వ్యక్తిగానూ ఆయన రికార్డు నమోదు చేశాడు. చేతి మణికట్టు నుంచి మధ్యవేలు చివరివరకు 11.2 అంగుళాలు ఉంటుందట. ప్రపంచంలోనే అతిపొట్టి వ్యక్తిగా పేరొందిన జ్యోతి ఆమ్గే ఎత్తు 62.8 సెం.మీ.(24.7 అంగుళాలు) మాత్రమే. డిసెంబర్‌ 6, 1993లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు. ఇటీవల ఆమె తన 30వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇలా అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న వీరిద్దరూ 2013లో మొదటిసారి ఒకే వేదికపై కనిపించారు. చైనాలో జరిగిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టీవీ షో అందుకు వేదికైంది. చివరిసారి 2018లో ఈజిప్టులో జరిగిన ఓ ఫొటో షూట్‌లో వీరిద్దరూ మరోసారి సందడి చేశారు. ఈజిప్టులో పర్యటకానికి ఊతమిచ్చేందుకు అక్కడి పర్యటక విభాగం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి వీరిద్దర్నీ ఆహ్వానించారు. తిరిగి ఆరేళ్ల అనంతరం సుల్తాన్‌, ఆమ్గేలు ఒకేచోట కనిపించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)