శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ సేవలు !

Telugu Lo Computer
0


గత వారం ఫ్రాన్స్‌లో ప్రారంభమైన యూపీఐ సేవలను తాజాగా శ్రీలంక, మారిషస్‌కూ విస్తరించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన వర్చువల్‌ సమావేశంలో మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కుమార్‌ జగన్నాథ్‌, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేతో కలిసి ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు. మారిషస్‌లో రూపే కార్డులను సైతం ప్రారంభించారు. శ్రీలంక, మారిషస్‌ ప్రజలతో భారత్‌కున్న ప్రత్యేక సంబంధాల దృష్ట్యా ప్రారంభిస్తున్న యూపీఐ సేవలు చాలామందికి ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌ నుంచి శ్రీలంక, మారిషస్‌కు వెళ్లేవారు ఇకపై యూపీఐతో చెల్లింపులు చేయొచ్చు.త్వరలో మారిషస్‌ బ్యాంకులు రూపే కార్డులనూ జారీ చేసే అవకాశం ఉంది. వాటిని ఆ దేశంతో పాటు భారత్‌లోనూ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)