బైడెన్‌ స్థానంలో మిచెల్‌ ఒబామా ?

Telugu Lo Computer
0


మెరికా అధ్యక ఎన్నికలకు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా జో బైనెన్‌ స్థానంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్‌ ఒబామా ప్రదాన ఎంపికైనట్లు వెల్లడైంది. పోల్‌ సర్వే రాస్ముస్సేన్‌ రిపోర్ట్స్‌ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పేర్కొంది. డెమోక్రాట్లలో సుమారు సగం మంది మిచెల్‌ను ఎంపిక చేశారు. ఇటీవల నిర్వహించిన పోల్‌లో సుమారు 48 శాతం మంది బైడెన్‌ స్థానంలో పార్టీ మరొక అభ్యర్థిని ఎంపిక చేయడానికి సమ్మతిస్తున్నట్లు తెలిపారు. 38 శాతం మంది నిరాకరించారు. అయితే, అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని 33 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. బైడెన్‌ స్థానంలో మిచెల్‌ ఒబామాకు 20 శాంత ఓట్లు వచ్చాయి. ఇతర పోటీదారులుగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌, కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ , మిచిగాన్‌ గ్రెట్చెన్‌ విట్మర్‌లను ప్రకటించారు. కమలాహారిస్‌కు సుమారు 15 శాతం ఒట్లు రాగా, 12 శాతం మంది మరోసారి హిల్లరీ క్లింటన్‌, డొనాల్డ్‌్‌ ట్రంప్‌ మధ్య మళ్లీ పోటీకి మొగ్గు చూపారు. మిచెల్‌ ఒబామా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయాలని అధిక శాతం మంది పిలుపునిచ్చినట్లు సర్వే తెలిపింది. రాబోయే ఎన్నికలు తనని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఇటీవల మిచెల్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)