అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు ​జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫిబ్రవరి 29న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అఖిలేష్‌ యాదవ్‌ను ఈ కేసులో సాక్షిగా సీబీఐ గురువారం ప్రశ్నించనున్నది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలైన షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్‌పూర్, హమీర్‌పూర్, సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012-2016 మధ్య ప్రభుత్వ అధికారులు నియమాలు, నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ సైట్‌లను కొందరికి అక్రమంగా కేటాయించినట్లు సీబీఐ ఆరోపించింది. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. 2012- 2013 జూన్‌ మధ్య మైనింగ్ శాఖ నిర్వహించిన అఖిలేష్‌ యాదవ్‌ను సాక్షిగా విచారణకు రావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)