ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ను పెళ్లాడిన లీనా మేరీ జోసెఫ్ !

Telugu Lo Computer
0


ప్రముఖ మలయాళ నటి లీనా మేరీ జోసెఫ్ జనవరి 17న ప్రముఖ ఆస్ట్రోనాట్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ను పెళ్లాడినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ప్రశాంత్‌ నాయర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లీనా తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈరోజు, ఫిబ్రవరి 27, 2024న, మన ప్రధాని మోదీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ ఆస్ట్రోనాట్ వింగ్స్‌ బహుకరించారు. మన దేశం, కేరళ, ముఖ్యంగా నాకు ఇది చాలా గర్వించదగ్గ చారిత్రక సందర్భం. అధికారికంగా నేను ప్రశాంత్‌ను జనవరి 17, 2024న సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నానని మీకు తెలియజేయడానికి ఈ ప్రకటన కోసం వేచి ఉన్నా' అంటూ పోస్ట్ చేసింది. లీనా తెలుగులో వచ్చిన సైతాన్ వెబ్‌ సిరీస్‌లో నటించింది. మహి వీ రాఘవ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆమె ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న ఆడుజీవితం చిత్రంలో నటిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)