పార్టీ కార్యకర్తకు కుక్క బిస్కెట్‌ ఇచ్చారు ?

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఓ శునకానికి ఇచ్చిన బిస్కెట్‌ను అది తినేందుకు నిరాకరించగా అదే బిస్కెట్‌ను పార్టీ కార్యకర్తకు ఇచ్చారని వైరల్ అవుతున్న వీడియోపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ వీడియోపై రియాక్టయిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో జార్ఖండ్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్ ఇస్తుండటం కనిపించింది. అదే సమయంలో పెద్దసంఖ్యలో అక్కడకు చేరిన పార్టీ కార్యకర్తలు రాహుల్‌తో మాట్లాడుతూ సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే ఈ వీడియోలో రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్‌ను పార్టీ మద్దతుదారుడికి అందించినట్టు కనిపించలేదు. అయితే హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేసిన వైరల్ వీడియోలో కుక్క తినేందుకు నిరాకరించగా ఆ బిస్కెట్‌ను రాహుల్ పార్టీ వ్యక్తికి అందిస్తుండటం కనిపించింది. కాంగ్రెస్ నేత తన మద్దతుదారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. గాంధీ వారసుల పార్టీ తనకు కూడా బిస్కెట్ తినిపించాలని చూసిన ఆత్మగౌరవం కలిగిన అస్సామీగా, భారతీయుడిగా నిరాకరించి ఆ పార్టీకి రాజీనామా చేశానని శర్మ పేర్కొన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల వేళ వైరల్ డాగ్ బిస్కెట్ వీడియో బీజేపీకి ఆయుధంగా మారింది. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పార్టీ బూత్ ఏజెంట్లను కుక్కలతో పోలిస్తే లేటెస్ట్‌గా రాహుల్ గాంధీ తన యాత్రలో పార్టీ కార్యకర్తలకు కుక్క బిస్కెట్లు పంచారని బీజేపీ ఐటీ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శలు గుప్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)