ముంబైలో పెద్ద ఎత్తున ఇండియా కూటమి ర్యాలీ ?

Telugu Lo Computer
0


ఫిబ్రవరి చివరిలో ముంబైలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టేందుకు ఇండియా కూటమి సిద్ధపడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష బలాన్ని, తమ ఐక్యతను చాటిచెప్పేందుకు కూటమి ఉమ్మడి ర్యాలీకి ప్రణాళికలు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పువ్వు పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో ఉన్న జేడీయూ ఇప్పటికే బయటకు వెళ్లిపోయింది. బీజేపీతో జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇంకోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ అభ్యర్థులను ప్రకటించేశారు. ఇలా ఎవరికి వారే సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో చేపట్టబోయే భారీ ర్యాలీలో ఎవరెవరు పాల్గొంటారనేది సందిగ్ధం నెలకొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)