రబ్రీ దేవి, మీసా భారతి, హేమా యాదవ్‌ పేర్లతో ఈడీ తొలి ఛార్జిషీట్‌ను దాఖలు !

Telugu Lo Computer
0


ర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన 'భూమికి ఉద్యోగం కుంభకోణంతో సంబంధమున్న మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తొలి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. లాలూ కుటుంబ సభ్యులు ముగ్గురితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు, రెండు సంస్థల పేర్లను ఇందులో చేర్చింది. లాలూ సతీమణి, బీహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవి, కుమార్తెలు ఎంపీ మీసా భారతి, హేమా యాదవ్‌, లాలూ కుటుంబ సన్నిహితుడు అమిత్ కత్యాల్, రైల్వే ఉద్యోగి, లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హృదయానంద్‌లతోపాటు ఏకే ఇన్ఫోసిస్టమ్స్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌లపై అభియోగాలు మోపింది. ఢిల్లీ లోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో 'ఈడీ' తన ఛార్జిషీటును సమర్పించింది. నిందితులను ప్రాసిక్యూట్ చేయాలని కోర్టును అభ్యర్థించింది. ఈ వ్యవహారంలో ఇంతకుముందు అటాచ్ చేసిన ఆస్తులను జప్తు చేయాలని కోరింది. జనవరి 16న ఈ కేసు విచారణకు రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అధికారులు గత ఏడాది నవంబర్‌లో కత్యాల్‌ను అరెస్టు చేశారు. వాదనలు రికార్డు చేసేందుకు హాజరు కావాల్సిందిగా లాలూకు సమన్లు పంపినా.. ఇంకా విచారించలేదు. ఆయన కుమారుడు, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ ఒకసారి హాజరయ్యారు. మరోసారి విచారణకు రావాల్సిందిగా ఇటీవల నోటీసులు వచ్చాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)