అమెరికాలో చద్దన్నానికి గిరాకీ !

Telugu Lo Computer
0


మెరికాలోని ఓ స్టోర్‌లో చద్దన్నం దాదాపు వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారని, కలికాలం అంటే ఇదేనంటూ ఓ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పటికే 4.2 వ్యూస్‌తో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. దీంతో మరోసారి చద్దన్నంపై చర్చ నడుస్తుంది. చద్దన్నంలో ఐరన్‌, కాల్షియం,పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది. యాంగ్జయిటీని దూరం చేయడంతో చద్దన్నం కీ రోల్ పోషిస్తుంది. ఒంట్లో వేడిని తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తహీనత నుంచి బయటపడొచ్చు చద్దన్నం తింటే అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు దూరమవుతాయి. ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. తరచూ చద్దన్నం తింటే బద్దకం, నీరసం లేకుండా ఉంటుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)