రూ. 650 కోట్లు రాబట్టే దిశగా సలార్ !

Telugu Lo Computer
0


ప్రభాస్ నటించిన సలార్- పార్ట్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీ సృష్టిస్తుంది. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా గత 11 రోజులుగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 650 కోట్లు కలెక్ట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సలార్ పార్ట్ వన్ రూ. 625 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. వీకెండ్ డేస్, న్యూ ఇయర్ అన్ని కలిసి రావడంతో దేశ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 15 కోట్లు రాబట్టింది.  కాగా, డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ పార్ట్ 1 భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ డంకీ సినిమా కూడా అదే రోజు విడుదలై సలార్ కు గట్టి పోటీగా వచ్చింది. కానీ అది అనుకున్నంత ప్రభావితం చూపకపోవడంతో సలార్ సినిమాకు కలెక్షన్ ల వరద వచ్చింది. 'సాలార్' ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11 రోజుల్లోనే రూ.625 కోట్లు రాబట్టడంతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని పరిస్థితి కనిపిస్తోంది. దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.360.77 కోట్లు కలెక్ట్ చేసి తన సత్తా చూపించింది. 'సాలార్' జనవరి 1న 48.75 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)