శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించే లక్ష్యంతో విశ్వవిద్యాలయాలు యువతను తయారు చేయాలి !

Telugu Lo Computer
0


మిళనాడులోని తిరుచిరాపల్లిలో భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ భవిష్యత్ లో శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించే లక్ష్యంతో విశ్వవిద్యాలయాలు యువతను తయారు చేయాలనీ, ఈ యూనివర్సిటీ పరిధిలోకి ఎన్నో ప్రతిష్టాత్మకమైన కాలేజీలు వచ్చాయని, ఈ కళాశాలల్లో కొన్ని ఇప్పటికే గొప్ప వ్యక్తులను తయారుచేసిన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాయన్నారు. భారతిదాసన్ విశ్వవిద్యాలయం బలమైన, పరిణతి చెందిన పునాదిపై ప్రారంభమైందన్నారు. కోవిడ్ -19 సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లను రవాణా చేయడంలో యువ శాస్త్రవేత్తలు గొప్ప పాత్ర పోషించారన్నారు. చంద్రయాన్ వంటి మిషన్ల ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచ పటంలో చెరపరని ముద్ర వేశారని తెలిపారు. మన ఆవిష్కర్తలు పేటెంట్ల సంఖ్యను 2014లో 4వేలు ఉంటె, ఇప్పుడు దాదాపు 50 వేల పేటెంట్లు ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు.  ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పాల్గొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)