పోలీసు కమాండోలపై మణిపూర్‌ మిలిటెంట్ల దాడి !

Telugu Lo Computer
0


యన్మార్‌ సరిహద్దుల్లోని మోరే నగరంలో మణిపూర్‌ మిలిటెంట్లు పోలీసు కమాండోలపై మెరుపు దాడి చేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు పోలీసు కమాండోలు, ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే వాయు మార్గంలో ఇంఫాల్‌ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌ సామాన్య పౌరులపై దుండగులు కాల్పులు జరిపిన మరుసటి రోజే.. భద్రతాదళాలపై మిలిటెంట్లు దాడి చేయడం గమనార్హం. నూతన సంవత్సర వేడుకల వేళ థౌబాల్‌ జిల్లాలో సోమవారం హింసాత్మక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భద్రతా బలగాలను పోలిన దుస్తులు ధరించిన దుండగులు పౌరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహించిన స్థానికులు వాహనాలను తగులబెట్టారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలతో లోయ ప్రాంతాలైన థౌబాల్‌, ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ, కాక్చింగ్‌, బిష్ణుపుర్‌ జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)