అయోధ్యకు సుగంధభరిత బియ్యం, 100 టన్నుల కూరగాయలు !

Telugu Lo Computer
0

త్తీస్‌గఢ్ మిల్లర్స్ అసోసియేషన్ అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుగంధభరిత బియ్యాన్ని పంపనుంది. అలాగే ఈ ప్రాంతపు రైతులు తాము పండించిన కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించారు. రాజధాని రాయ్‌పూర్‌లోని రామాలయంలో జరిగిన ‍ప్రత్యేక కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి పాల్గొని, ఆలయ ప్రాంగణం నుంచి 300 మెట్రిక్ టన్నుల సుగంధభరిత బియ్యంతో అయోధ్యకు బయలుదేరిన 11 ట్రక్కులకు పచ్చజెండా చూపారు. ఇదిలావుండగా సీఎం విష్ణు దేవ్‌సాయి తన సోషల్‌ మీడియా ఖాతాలో 'రాముని దర్శనం కోసం ఆతృతగా వేచిచూస్తున్నాం. జనవరి 22న అయోధ్యలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. రాష్ట్రంలోని రైతులు వారి పొలాల్లో పండించిన 100 టన్నుల కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించుకున్నారు. శ్రీరాముడు ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నాడు. ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్న రాష్ట్రంలోని రైతులు అభినందనీయులు' అని పేర్కొన్నారు. కాగా ఛత్తీస్‌గఢ్‌ రైస్‌మిల్లర్లు అయోధ్యకు సుగంధభరిత బియ్యం పంపినందుకు సీఎం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)