భర్త, మరిదిని కాల్చి చంపిన ఆశా వర్కర్ !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని, బద్‌నగర్ తహసీల్ పరిధిలోని ఇంగోరియాలో  జనవరి 1 ఉదయం 10 గంటలకు ఆశా వర్కర్ సవితా కుమారియా తన భర్త రాధేశ్యామ్, మరిది ధీరజ్ అలియాస్ దినేష్‌లపై కాల్పులు జరిపింది. రాధేశ్యామ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, అతని సోదరుడు మాత్రం కిందపడిపోయాడు. మహిళ విచక్షణా రహితంగా కాల్పులు జరిపి కుటుంబ సభ్యులపై కూడా దాడికి యత్నించిందని, అయితే ఆమె పిస్టల్‌లో బుల్లెట్స్ అయిపోవడంతో అక్కడ నుంచి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హత్య చేసిన తర్వాత మహిళ పిస్టల్‌తో ఇంగోరియా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మూడు నాలుగు నెలల క్రితం కూడా కుటుంబంలో గొడవలు జరిగినట్లు స్థానికులు చెబుతుండగా, ఇదే విషయమై రెండు మూడేళ్లుగా వివాదం నడుస్తున్నట్టు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)