14 నుంచి రాహుల్‌ గాంధీ 'భారత్‌ న్యాయ యాత్ర' ప్రారంభం !

Telugu Lo Computer
0


నవరి 14 నుంచి మణిపూర్‌లోని ఇంపాల్‌లో  రాహుల్‌ గాంధీ 'భారత్‌ న్యాయ యాత్ర' ప్రారంభం కానుంది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ల మీదుగా ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో సాగనుంది. రాబోయే 2024 సాధారణ పార్లమెంట్‌లో గెలుపే లక్ష్యంగా రాహుల్‌ గాంధీ చేపట్టబోయే యాత్రకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌ గాంధీ తన 'భారత్‌ న్యాయ యాత్ర'ద్వారా ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలను ఫోకస్‌ చేయనున్నట్లు తెలుసోంది. వీలైనన్ని ఎక్కువ రోజులు ఈ రెండు రాష్ట్రాలను యాత్ర కొనసాగిస్తారని సమాచారం. గుజరాత్‌లో గత రెండు సాధారణ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కనీసం కనీసం ఒక్కసీటు కూడా గెలవకపోవటం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో సోనియా గాంధీ మాత్రమే గెలుపొందారు. అయితే పార్టీ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ పాగా వేయడానికి రాహుల్‌ గాంధీ యాత్రను ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో యాత్ర ప్రారంభమై నాగాలాండ్‌లో ఒకరోజు, ఆస్సాంలో 3 లేదా 4 రోజులు రోజుల పాటు యాత్ర కొనసాగి పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్‌లో సైతం కాంగ్రెస్‌ పార్టీ గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమైతమైనంది. బెంగాల్‌లోని ఉత్తర బెంగాల్‌ ప్రాంతంలో యాత్ర ఫోకస్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. నార్త్‌ బెంగాల్‌లో ఉన్న మూడు స్థానాలు రిజర్వడ్‌ కాగా అక్కడ కాంగ్రెస్‌ బలమైన ఓటు బ్యాంక్‌ ఉండటం విశేషం. 14 రాష్ట్రాల్లో చేపట్టబోయే రాహుల్‌ 'భారత్ న్యాయ యాత్ర' 358 ఎంపీ నియోజకవర్గాల కుండా సాగుతుంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌పార్టీ రాహుల్‌ గాంధీ యాత్రకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముంబైలో ముగిసే రాహుల్‌ 'భారత్‌ న్యాయ యాత్ర'కు సంబంధించిన అధికారిక ఫైనల్‌ రూట్‌ మ్యాప్‌ సిద్ధం కాలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)