హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది జావేద్‌ అహ్మద్‌ అరెస్టు !

Telugu Lo Computer
0

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది జావేద్‌ అహ్మద్‌ మట్టోను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా ప్రణాళికతో మాటువేసిన స్పెషల్‌ సెల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్‌ లోయలో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేయడమే కాకుండా.. కీలక ప్రాంతాల్లో దాడులకు పన్నాగం పన్నుతున్నాడన్న ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. భద్రతా సంస్థల దగ్గరున్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో జావేద్‌ ఒకడు. ఇతడిపై కేంద్రం రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)