మొహల్లా క్లీనిక్‌లపై దర్యాప్తు ?

Telugu Lo Computer
0


ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లీనిక్‌ల్లో దర్యాప్తు చేపట్టాల్సిందిగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సీబీఐని ఆదేశించినట్లు సమాచారం. ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ఆప్‌ ప్రభుత్వం మొహల్లా క్లీనిక్‌లను ఏర్పాటు చేసింది. రోగులు లేకపోయినప్పటికీ రేడియాలజీ, పాథాలజీ పరీక్షలు నిర్వహించినట్లు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నాయని తెలిపాయి. దీంతో గవర్నర్‌ వీకే సక్సేనా దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించారని పేర్కొన్నాయి. కొందరు డాక్టర్లు ఆలస్యంగా విధులకు వెళుతూ వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపాయి. మరికొందరు అసలు క్లీనిక్‌కు రాకుండానే వచ్చినట్లు ఫేక్‌ రిపోర్టులు సృష్టిస్తున్నారని వెల్లడించాయి. ఈ నిర్లక్ష్యంపై గతంలోనూ ఢిల్లీఆరోగ్య మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏడుగురు వైద్యులపై వేటు పడింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శిని తొలగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాసిరకం మందులు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలపై గతంలోనూ దర్యాప్తునకు సీబీఐని ఎల్జీ సక్సేనా ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)